ఐదు భాషల్లో హర్బజన్ – అర్జున్ ‘ఫ్రెండ్ షిప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దీనికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ. ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు సినిమాలను గొప్పగా ఆదరిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఒరేయ్ బామ్మర్ది చిత్రం. రీసెంట్గా థియేటర్స్‌లో విడులైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో మా తదుపరి చిత్రం ‘ఫ్రెండ్ షిప్’ను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో తీసిన సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఫ్రెండ్ షిప్’ను నిర్మించారు. కాలేజ్ స్టూడెంట్స్ కు, రాజకీయ నేతలకు మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య తెరకెక్కించారని నిర్మాత బాలాజీ తెలిపారు. ఇందులో ఐదు ఫైట్స్, నాలుగు పాటలుంటాయని, సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
Also Read
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!