HBD Ram Charan : నేడు రామరాజు… రేపు సిద్ధా… చరణ్ బాణీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే)
ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే, తనదైన బాణీ పలికిస్తున్నారు చరణ్. నటనిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. తండ్రి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో నిర్మాతగా మారిన రామ్ చరణ్, తరువాత తండ్రితోనే ‘సైరా…నరసింహారెడ్డి’ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు నాన్నతో కలసి నటిస్తూ ‘ఆచార్య’ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక తన మిత్రుడు యన్టీఆర్ తో కలసి చెర్రీ నటించిన ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేస్తోంది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్ అభినయం అందరినీ అలరిస్తోంది.
రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించారు. తండ్రి, మేనమామ, తాతయ్య అందరూ చిత్రసీమకు చెందినవారే కావడంతో చిన్నతనం నుంచీ చెర్రీ కూడా సినిమా వాతావరణాన్ని ఆస్వాధిస్తూనే పెరిగారు. దాంతో సహజంగానే చెర్రీకి చిత్రసీమపై ఆసక్తి కలిగింది. చిరంజీవి వారసుడిగా 2007లో రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేశారు. చిరంజీవి తనయుడు కావడంతో చెర్రీకి ఒక్క సినిమాలో నటించకపోయినా, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు సాగుతూ ఉన్నాయి. ఆయన నటవారసునిగా చరణ్ వస్తున్నాడని తెలియగానే, ఈ అంశంపైనా చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’తోనే ఆకట్టుకోవడం విశేషం. చరణ్ తన రెండో చిత్రం ‘మగధీర’తోనే ఇండస్ట్రీ హిట్ పట్టేశారు. ‘మగధీర’ గ్రాండ్ సక్సెస్ చెర్రీని ఎక్కడికో తీసుకు వెళ్ళింది. అభిమానులకు మరచిపోలేని మధురానుభూతిని పంచింది ‘మగధీర’. అదే యేడాది చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా చేశారు. అభిమానులు చరణ్ లోనే చిరంజీవిని చూసుకోసాగారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తండ్రి అడుగుజాడల్లోనే పయనించసాగారు చెర్రీ. స్టార్ డమ్ రాగానే నాన్న బాటలోనే పయనిస్తూ హిందీ చిత్రసీమవైపూ దృష్టి సారించారు చరణ్. అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ మేన్ గా గుర్తింపు తెచ్చిన ‘జంజీర్’ ను రీమేక్ చేశారు చెర్రీ. హిందీలో ‘జంజీర్’గా, తెలుగులో ‘తుఫాన్’గా విడుదలయిన ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మళ్ళీ ‘మగధీర’ స్థాయి విజయం కోసం చరణ్ పలు విధాలా కృషి చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అయితే 2018లో అనూహ్యంగా రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఘనవిజయం సాధించింది. అందులో చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటన అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలచింది.
చిరంజీవి తన మాతృమూర్తి అంజనాదేవి పేరుపై అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. అదే తీరున రామ్ చరణ్ తన తల్లి సురేఖను సొంత చిత్రాలకు సమర్పకురాలిగా చేశారు. తమ ఇంటిపేరున కొణిదెల ప్రొడక్షన్స్ ను నెలకొల్పారు చెర్రీ. తొలి చిత్రంగా తండ్రితో ‘ఖైదీ నంబర్ 150’ నిర్మించారు. చిరంజీవి రీ ఎంట్రీగా విడుదలయిన ‘ఖైదీ నంబర్ 150’ ఘనవిజయం సాధించింది. తరువాత చిరంజీవి తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన ‘సైరా… నరసింహారెడ్డి’ని కూడా చెర్రీనే నిర్మించడం విశేషం. నాన్నను వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం నిర్మాణ భాగస్వామిగా మారారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ ఏప్రిల్ 29న జనం ముందు నిలువనుంది. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’లో రామరాజుగా మెప్పించిన చరణ్, ‘ఆచార్య’లో సిద్ధా పాత్రలో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!