లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్. అతి తక్కువ సమయంలోనే కమల్ కూతురిగా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకుంది. స్టార్ లీగ్ అనే వార్ కి దూరంగా ఉంటూనే తెలుగులో టాప్ హీరోలందరితో నటించింది శృతి హాసన్. తన గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న శృతి హాసన్ కో గోల్డెన్ హ్యాండ్ అనే పేరుంది. ఎందుకంటే ఏ స్టార్ హీరో ఫ్లాప్స్ లో ఉన్నా… శృతి హాసన్ తో నటిస్తే ఆ సినిమా హిట్ అనే మాట ఇండస్ట్రీలో ఉంది. ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న శృతి హాసన్… పవన్ కళ్యాణ్ కంబ్యాక్ హిట్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఫ్లాప్స్ లో ఉన్న రవితేజకి గోపీచంద్ మలినేని క్రాక్ తో సాలిడ్ హిట్ ఇచ్చాడు. ఇందులో అయితే శృతి హాసన్ ఫైట్స్ కూడా చేసింది. ఇద్దరమ్మాయిలతో సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసిన అల్లు అర్జున్ కి అప్పటికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన రేస్ గుర్రం సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్. ఇలా చాలా సార్లు హిట్ సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా కూడా ఈ కేటగిరిలోకే వస్తుంది. ఇటీవలే ప్రభాస్ తో శృతి హాసన్ నటించిన సలార్ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఇలా ఫ్లాప్స్ లో ఉన్న హీరోలు కంబ్యాక్ ఇచ్చిన సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. అందుకే ఆమెని గోల్డెన్ హ్యాండ్ అంటూ ఉంటారు. ఇలాంటి గోల్డెన్ హ్యాండ్ కి బర్త్ డే విషెస్ చెప్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
