NTV Telugu Site icon

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞా.. సౌండు లేదెందుకు?

Nandamuri Mokshagna Birthday

Nandamuri Mokshagna Birthday

Happy Birthday Nandamuri Mokshagna: యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు, నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఆరంగ్రేటం ఎప్పుడు అంటే ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి.. నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానులు సైతం గత కొన్ని సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. లెజెండ్ షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే ఆయన హీరోగా పరిచయం అయ్యే సినిమా ఇదే, లాంచ్ చేసే డైరెక్టర్ ఈయనే అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ముందుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ ఉంటుందని ప్రచారం జరిగగా ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞను పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నట్లు కూడా ఇంకో వార్త బయటకు వచ్చింది. ఇక వారిద్దరూ కాదని ఆదిత్య 369 లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని అది ఆదిత్య 369 సీక్వెల్ అని కూడా మరో వార్త బయటకు వచ్చింది. దానికి బాలయ్య కూడా నిజమే అని అనడంతో ఇక లాంఛింగ్ ఖాయం అనుకున్నారు. అయితే ఆ వార్త కూడా ప్రచారానికే పరిమితం అయింది. ఇక ఆ తరువాత బాలయ్య పైసా వసూల్ లాంటి సినిమా తీసిన పూరి జగన్నాథ్, మోక్షజ్ఞను లాంచ్ చేస్తున్నారని ఒక వార్త, లేదు బాలయ్యకి అచ్చొచ్చిన బోయపాటి లాంచ్ చేస్తాడని ఒక వార్త కూడా తెర మీదకు వచ్చింది.

Mahesh babu: జవాన్ కోసం ఆగలేకున్నానంటూ మహేష్ ట్వీట్.. కలిసి చూద్దామన్నా షారుఖ్

కానీ ఏదీ నిజం కాలేదు. అయితే నిజానికి ఇప్పుడు ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు, ఒకరకంగా 30 ఏళ్ళు వచ్చేస్తున్నా నందమూరి కాంపౌండ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు, అసలు నందమూరి మోక్షజ్ఞ అరంగ్రేటం ఎప్పుడు ? అంటే ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. 12 ఏళ్లకే జూ.ఎన్టీఆర్ స్క్రీన్ అప్పియరెన్స్ ఇస్తే 22 ఏళ్లకే చిరుతతో చరణ్ ఎంట్రీ ఇచ్చాడు, ఇక 22 ఏళ్లకే నాగ చైతన్య జోష్ వచ్చేశాడు. కానీ వచ్చే ఏడాదితో 30 ఏళ్ళు పూర్తి, ఇంకా లాంచింగ్ సినిమా గురించి ఎటువంటి అధికారిక వార్త కానీ కథా చర్చలు మొదలయ్యాయనే లీకులు కూడా లేవు. కొన్నాళ్ల క్రితం వరకు బాడీ కూడా ఫిట్ లేదు కానీ కష్టపడి ఒక రూపుకు వచ్చాడు. అయితే బాలకృష్ణ చెబుతున్న దాని ప్రకారం “ఆదిత్య 369”కి సీక్వెల్ మోక్షుతో ప్లాం చేశారని అంటున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌లో తన కొడుకు మోక్షజ్ఞను పరిచయం చేస్తానని నందమూరి బాలకృష్ణ ఆ మధ్య ఫిలడెల్ఫియాలో జరిగిన న తానా కన్వెన్షన్‌లో ఆఫ్-ది రికార్డ్ గా మాట్లాడుతూ వెల్లడించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని కూడా ఆయన అప్పట్లో అన్నారు. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కుమారుడు మోక్షజ్ఞ మరో కీలక పాత్రలో కనిపించనున్నారని చెబుతున్నారు. సినీ ఎంట్రీ కోసమే మోక్షజ్ఞ స్లిమ్ అవ్వగా ఇప్పుడు డ్యాన్స్, డైలాగ్ మాడ్యులేషన్, యాక్టింగ్ వంటి వాటిపై కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సో ఏదైతేనేం మోక్షజ్ఞ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటూ ఎన్టీవీ ఆయన విషెస్ తెలుపుతోంది.

Show comments