NTV Telugu Site icon

Hanuman Trailer: జై హనుమాన్… పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మ చూపించారు

Hanuman Trailer

Hanuman Trailer

ప్రశాంత్ వర్మ… ఈ జనరేషన్ తెలుగు సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. క్రియేటివ్ స్క్రిప్ట్, గ్రాండ్ మేకింగ్… ఈ రెండు విషయాలని మేనేజ్ చేస్తూ మంచి సినిమాలని చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబీరెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘హనుమాన్’ సినిమా చేస్తోంది. చిన్న రీజనల్ సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఈరోజు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకుంది. ప్రమోషనల్ కంటెంట్ తో విషయం ఉండడం, ప్రశాంత్ వర్మపై ఆడియన్స్ కి ఉన్న నమ్మకం హనుమాన్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. మొట్టమొదటి ఇండియన్ సూపర్ హీరో కథగా హనుమాన్ ప్రమోట్ అవుతుంది. జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతున్న హనుమాన్ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ క్వాలిటీ చూస్తే పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది.

ఒక నెగటివ్ ఫోర్స్… ఫెర్మిడబుల్ ఫోర్స్ కోసం వెతుకుతూ ఉండగా వాళ్లకి హనుమాన్ గురించి తెలియడంతో వార్ మొదలవుతుంది. ఒక హనుమంతుడి భక్తుడు నెగటివ్ ఫోర్స్ కి వ్యతిరేఖంగా ఎలా పోరాడాడు అనేది కథగా కనిపిస్తోంది. ట్రైలర్ ఓపెనింగ్స్ షాట్ నుంచే మెస్మరైజ్ చేయడం స్టార్ట్ అయ్యింది. తేజ సజ్జా సూపర్ హీరోగా చాలా బాగున్నాడు. వరలక్ష్మి తేజా సజ్జాకి అక్క పాత్ర నటించినట్లు ఉంది, ట్రైలర్ లో ఫైట్స్ కూడా చేస్తూ కనిపించింది. సముద్రఖని కొత్త గెటప్ లో కనిపించాడు, ఈయన క్యారెక్టర్ చాలా స్పెషల్ గా నిలిచేలా ఉంది. వినయ్ రాయ్ నెగటివ్ షేడ్ లో పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో సినిమాటోగ్రాఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఎండ్ షాట్ లో హనుమంతుడు రివీల్ అయ్యే షాట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ట్రైలర్ లోనే ఈ షాట్ ఇలా ఉంటే థియేటర్స్ లో ప్రతి ఒక్కరితో జై హనుమాన్ అనిపించడం గ్యారెంటీ. ఓవరాల్ గా ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జా ఆడియన్స్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.