Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి సంక్రాంతి రేసులో హనుమాన్ చోటు సంపాదించుకుంది. ఇక మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ తన టేకింగ్ తో.. విజువల్ ఎఫెక్ట్స్ తో అదరగొట్టేశాడు. తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ విజువల్స్ ను చూపించి ఔరా అనిపించాడు. ఆదిపురుష్ సినిమా సమయంలో హనుమాన్ టీజర్ రిలీజ్ అవ్వడంతో.. ప్రభాస్ మూవీని ట్రోల్ చేస్తూ.. హనుమాన్ ను ప్రశంసించారు. అప్పటినుంచే ఈ సినిమాపై హైప్ మొదలయ్యింది. ఇక బుకింగ్స్ లో కూడా హనుమాన్.. మిగతా సినిమాల కన్నా ముందే ఉంది. అలా బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం.. హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయి.
ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రశాంత్ తన క్రియేటివిటీని ఉపయోగించాడు. దీనికోసం ఇన్స్టాగ్రామ్ లో హనుమాన్ రూపాన్ని తీసుకొచ్చాడు. AI టెక్నాలజీతో ఎక్కడ సినిమా చూసినా.. హనుమాన్ కనిపిస్తాడు. ఇలా కొత్త కొత్త ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పెంచేశాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం అదరగొడుతున్నాడు. 10 డేస్ టూ గో అంటూ సినిమాలోని కొత్త పోస్టర్స్ తో హైప్ క్రియేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రశాంత్ వర్మ ఇందులో కూడా అతనా టాలెంట్ చూపించాడు. ఒక్కో పోస్టర్ లో ఒక్కో విజువల్ ను పెట్టి.. అందులోనే నంబర్స్ వచ్చేలా క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్టర్స్ చూసిన అభిమానులు ఏమైనా క్రియేటివిటీనా.. వర్త్ వర్మా.. వర్త్ అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ప్రశాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.