NTV Telugu Site icon

Hanuman: చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్న హనుమాన్ టీమ్.. అయోధ్య రామ మందిరానికి విరాళం

Ayodya

Ayodya

Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఘన విజయం సాధించింది. సినిమా మీద ఉన్న నమ్మకంతో హనుమాన్ టీమ్.. ఒక ప్రామిస్ ను చేసింది. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం.. ప్రీమియర్ షోకు వచ్చిన ప్రతి టికెట్ పై రూ. 5 రూపాయలు తీసి అయోధ్య రామ మందిరానికి విరాళంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇక చెప్పిన విధంగానే నేడు ఆ ప్రామిస్ ను నిలబెట్టుకున్నారు. హనుమాన్ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం ప్రీమియర్ షోలకు వచ్చిన టికెట్స్ అన్నింటిలో రూ. 5 రూపాయలు తీయగా వచ్చిన మొత్తాన్ని అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ విషయమై గతంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ” చెప్పినట్లే అయోధ్య రామమందిరానికి విరాళం ఇచ్చాము. అయితే మేము ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉండమని అనుకుంటున్నాం. ఎందుకంటే .. చాలామంది అనుకుంటారు. వీళ్ళు చెప్తారు కానీ.. విరాళం ఇవ్వరు.. వీళ్లే ఉంచుకుంటారు అని.. అందుకే మేము ఒక లైవ్ వెబ్ సైట్ ను క్రియేట్ చేస్తున్నాం. ఈ సైట్ లో ప్రపంచంలో ఎక్కడ టికెట్ తెగినా అందులో రూ. 5 రూపాయలు పక్కకు వెళ్లిపోతాయి. ఎప్పుడైనా మీరు ఆ సైట్ ను ఓపెన్ చేసి చూడొచ్చు” చెప్పుకొచ్చాడు. ఇక చెప్పినట్లుగానే నిన్న ఏర్పాటుచేసిన ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ. 14.25 లక్షలు వచ్చాయని, వాటిని అయోధ్య రామమందిరానికి విరాళం ఇస్తున్నట్టు తాజాగా నిర్వహించిన మూవీ సక్సెస్‌ మీట్‌లో నిరంజన్‌ రెడ్డి తెలిపారు. దీంతో ప్రేక్షకులు హనుమాన్ టీమ్ ను ప్రశంసిస్తున్నారు.

Show comments