HanuMan : చిల్డ్రన్స్ డే స్పెషల్.. సాంగ్ తో సర్ప్రైస్ చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటిస్తున్న లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హను మాన్’ . ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సూపర్ హీరో కథాంశం తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో సిని ప్రేక్షకుల్లో బాగా హైప్ క్రియేట్ అయ్యింది. చిత్రం యూనిట్ కూడా వరుస అప్డేట్స్ ను అందిస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.ప్రతి పండుగకు ‘హను మాన్’ చిత్రం నుంచి ఏదోక అప్డేట్ ఇస్తూ సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ మరో సర్ ప్రైజ్ ను ఇచ్చారు. చిత్రం నుంచి సూపర్ హీరో హను మాన్ అనే సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీ నుంచి మొదటి పాట ఇదే కావడం విశేషం.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో అప్డేట్లను కూడా అన్నీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన సాంగ్ నూ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేశారు.పిల్లలకు మరోసారి వెండితెరపై సూపర్ హీరోను పరిచయం చేస్తూ ఈ సాంగ్ ను సాగింది. లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సూపర్ మ్యాన్ పవర్స్ ను వివరిస్తూ సాగిన పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజువల్స్ అలాగే మ్యూజిక్ కూడా అద్బుతంగా వుంది.. కార్టూన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. కృష్ణ కాంత్ మంచి లిరిక్స్ ను అందించారు. సాయి వేదా వాగ్దేవి, ప్రకృతి రెడ్డి, మయూక్ చక్కగా ఆలపించారు.. అనుదీప్ దేవ్ అదిరిపోయే ట్యూన్ అందించారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మెస్మరైజింగ్ విజువల్స్, గ్రాఫిక్ వర్క్ తో టీజర్ అద్బుతంగా వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 11 దేశాల్లో 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!