Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హను-మాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.
ఇక తాజాగా హనుమాన్ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిముషాలు ఉండనుంది. హనుమాన్ విజువల్ గా అద్భుతంగా వుంది. ఎమోషన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. కంటెంట్ చాలా మెస్మరైజింగా వుంది అని సెన్సార్ సభ్యులు అభినందించారని తెలుస్తోంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ మ్యాన్ కథగా ఈ చిత్రాన్నితెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
