Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: ఆధ్యాత్మిక హిందీ డ్రామా ‘హనుమాన్ అన్ష్’ (Hanuman Ansh) ఆధ్యాత్మిక గురువు ‘నీమ్ కరోలి బాబా’ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. హనుమంతునిపై ఆయనకున్న అచంచలమైన భక్తి ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శోభినావ్ సత్యా, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై, కేవలం ₹2 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే సినిమాలో కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు మరో అంశం కూడా ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. అదే రాంబేటి శర్మ పాత్ర. ఆధ్యాత్మిక భావాలతో కనిపించే ఈ పాత్రను పోషించింది పూర్ణిమా తివారీ. అయితే ఆమె రియల్ లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్‌తో కనిపించే ఈమె, సినిమాలో మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించి ఆశ్చర్యపరచారు.
‘హనుమాన్ అన్ష్’లో పూర్ణిమా తివారీ నీమ్ కరోలి బాబా భార్య రాంబేటి శర్మ పాత్రలో నటించారు. నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైన రోజుల నుంచి ఆయన జీవితంలో రాంబేటి పోషించిన పాత్రను సినిమా చూపిస్తుంది. భర్త ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్న సమయంలో భార్యగా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు కూడా కథలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే రాంబేటి పాత్ర కోసం పూర్ణిమా తివారీ తన లుక్కు పూర్తి భిన్నంగా కనిపించారు. సోషల్ మీడియాలో మోడ్రన్, గ్లామరస్ లుక్స్‌తో కనిపించే ఆమె సినిమాలో మాత్రం చాలా సింపుల్‌గా, సంప్రదాయ దుస్తుల్లో, ఆధ్యాత్మిక నేపథ్యానికి తగ్గట్టుగా కనిపించారు. ఆమె మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ అన్నీ పాత్రకు అనుగుణంగా ఉండటంతో తెరపై ఆమెను చూసిన వెంటనే గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. నటిగా ఆమె పాత్రలోకి పూర్తిగా లీనం అయిపోవడంతో ఆమె నటనకు మంచి గుర్తింపు వస్తోంది.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
పూర్ణిమా తివారీ మోడలింగ్ రంగం నుండి నటన వైపు అడుగులు వేశారు. ‘హనుమాన్ అన్ష్’ కంటే ముందు ఆమె పలు హిందీ ప్రాజెక్టుల్లో కనిపించారు. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ఏక్తా కపూర్‌కు చెందిన యూట్యూబ్ షో ‘ప్యార్ కీ రాహే’లో నటించడంతో పాటు ‘ఘుమ్ హై కిసికే ప్యార్ మే’, ‘చునా’ వంటి ప్రాజెక్టుల్లోనూ భాగమయ్యారు. సినిమాల విషయానికి వస్తే ‘లకిర్రీన్’, ‘హర్దాంగ్’, ‘రాత్ అకేలీ హై’ వంటి సినిమాలలో కనిపించారు. దీంతో పూర్ణిమకు ఇప్పటికే నటిగా మంచి అనుభవం ఉన్నప్పటికీ, ‘హనుమాన్ అన్ష్’లోని రాంబేటి పాత్ర ఆమెకు మరో గుర్తింపును తీసుకొస్తోంది. సోషల్ మీడియాలో కూడా పూర్ణిమా తివారీ యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అక్కడ ఆమె తరచూ తన ఫ్యాషన్, గ్లామరస్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. అందుకే ఆమె సినిమాల్లో కనిపించే డీగ్లామర్ లుక్కు, సోషల్ మీడియాలో కనిపించే గ్లామరస్ ఇమేజ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తూ సోషల్ మీడియా ఫాలోవర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఇక ‘హనుమాన్ అన్ష్’ బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 25 రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించినట్టే. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. విశాల్ చతుర్వేది రచించి, దర్శకత్వం వహించిన ‘హనుమాన్ అన్ష్’లో చందన్ ఆనంద్, శోభినవ్ సత్య, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పూర్ణిమా తివారీ పోషించిన రాంబేటి పాత్రకు వస్తున్న స్పందన ఆమె కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కూడా సోషల్ మీడియా చర్చల్లో నిలిచింది.
- Tags
- cinema
- Hanuman Ansh
తాజావార్తలు
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..