NTV Telugu Site icon

Hanu Man Collections: మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాకి డబుల్!

Jai Hanuman

Jai Hanuman

Hanu Man Day1 Collections: చైల్డ్ యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై హీరోగా మారిన తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి ప్రీమియర్ షో నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయిన జాంబీ రెడ్డి అనే సినిమా లాంగ్ రన్ లో 12 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది.

Kangana Ranaut: కంగనా రనౌత్ పెళ్లి చేసుకునేది ఇతన్నేనా?

అలాంటిది, ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా హనుమాన్ మొదటి రోజే 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడం గమనార్హం. ఈ సినిమా ప్రీమియర్స్ కి రెండు కోట్ల 85 లక్షలు వసూలు కాగా మొదటి రోజు ఐదు కోట్ల పన్నెండు లక్షలు వెరసి మొత్తం ఏడు కోట్ల 97 లక్షల షేర్ 12 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. ఏరియాల వారీగా చూస్తే నైజాం ఒక్కచోట నుంచే మూడు కోట్ల 66 లక్షలు వసూలు అయినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోనూ కోటికి మించి వసూలు రాలేదు కానీ ఓవరాల్ గా చూసుకుంటే గట్టిగానే వచ్చాయి. కర్ణాటకలో కోటి పది లక్షలు, హిందీ సహా మిగతా భారతదేశం అంతా కలిపి కోటి 15 లక్షలు, ఓవర్సీస్ మూడు కోట్ల 55 లక్షలు మొత్తం కలిపి 13 కోట్ల 77 లక్షల షేర్, 25 కోట్ల 50 లక్షలు గ్రాస్ వసూలైనట్లు అయింది.