Site icon NTV Telugu

Hansika Motwani: కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

Hansika 1

Hansika 1

Hansika Motwani: గత కొంత కాలంగా సింధీ భామ హన్సిక మోత్వానీ పెళ్ళి కుదిరిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వస్తోంది. దాంతో పెళ్లికొడుకు ఎవరు? పెద్దలు కుదిర్చిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనే పలు సందేహాలు అందరినీ వెంటాడాయి. తాజాగా వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కాబోయే భర్త ఎవరనేది రివీల్ చేసింది. ఈఫిల్ టవర్ ముందు తన ఫియాన్సీ లవ్ ప్రపోజ్ చేస్తున్న పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘ఇప్పుడు… ఎల్లప్పుడూ’ అంటూ తను చేసిన పోస్ట్ కు వరుడు సోహల్ కతురియా కూడా ‘ఐ లవ్ యు మై లైఫ్… ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ’ అని రిప్లై ఇచ్చాడు.

Read Also: Prathibimbalu: ఒకరోజు ఆలస్యంగా అక్కినేని సినిమా..

వ్యాపారవేత్త అయిన సోహైల్ కతురియాతో హన్సిక నిశ్చితార్థం చేసుకున్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ జంటకు పరిచయం ఉందని, సోహైల్ కంపెనీలో హన్సికకు షేర్లు ఉన్నాయంటున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌ ముండోటా ప్యాలెస్‌లో డిసెంబర్ 2న వీరి పెళ్ళి వేడుకలు ప్రారంభం అవుతాయట. డిసెంబర్ 4న వీరి వివాహం కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. మరి ఈ వేడుకకు హన్సిక మాజీ ప్రియుడు శింబు కూడా హాజరవుతాడేమో చూడాలి.

 

Exit mobile version