Hansika motwani: సినీ నటి హన్సికా విడాకులు.. 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..

  • సినీనటి హన్సికా మొత్వానీ విడాకులు..
  • నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి..
Hansika Motwani

Hansika Motwani

Hansika motwani: ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సికా మొత్వాని 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించింది. తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సికా, తన గ్లామర్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. తమిళ ఇండస్ట్రీలో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది.

Read Also: Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..

తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకుంది. సోహైల్‌కు అప్పటికే రింకీ బజాన్ అనే యువతిని పెళ్లాడాడు. ఆ పెళ్లికి హన్సికా కూడా వెళ్లింది. కొంత కాలానే వారిద్దరు విడిపోవడంతో, సోహైల్‌కు హన్సికా దగ్గరైంది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత, సోహైల్‌ను పెళ్లాడుతున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే, గతేడాది నుంచి సోహైల్ హన్సికాలు విడిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి.