టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హన్సిక గత కొద్ది రోజులుగా వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్
తాజాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న హన్సిక, 2025 గురించి చెబుతూ .. ‘ ఈ సంవత్సరం నేను అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియని బలం ఉందని తెలిసింది. పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలు నా హృదయాన్ని ఆనందంతో నింపాయి. చిన్న విషయాలే జీవితంలో పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. అందరికీ ధన్యవాదాలు’ అని రాసింది. ఈ పోస్ట్‌తో పాటు, ఆమెపై వస్తున్న విడాకుల వార్తలు మరింత చర్చనీయాంశమయ్యాయి.
2022 డిసెంబర్‌లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లిని ‘Love Shaadi Drama’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. అయితే కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. సోహైల్ ఈ వార్తలను ఖండించిన, హన్సిక మాత్రం ఇప్పటివరకు మౌనం పాటించారు. ఇక తాజాగా, ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడం రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం హన్సిక ‘శ్రీ గాంధారి’ సినిమాలో నటిస్తోంది. ఆర్. కన్నన్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
