క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది ప్రముఖ నటి హంసానందిని. ఆ వార్త తెలియగానే సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికీ ఆమె శనివారం ధ్యాంక్స్ తెలిపింది. తన గురించి ఆలోచించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి హంసానందిని కృతజ్ఞతలు తెలిపింది.
తనపై హద్దులేని అభిమానాన్ని చూపడం మాటల్లో చెప్పలేనంత ఓదార్పును కలిగించిందని చెప్పింది. నలుమూలల నుండి అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ రంగానికి చెందిన వారు తన పట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపింది. వారి సపోర్ట్ తనను మరింత ధృడంగా చేసిందని చెబుతూ, ఓ తాజా ఫోటోను హంసానందిని పోస్ట్ చేసింది.
