Site icon NTV Telugu

Dear: హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఆరోజే రిలీజ్!

Dear News

Dear News

GV Prakash Kumar, Aishwarya Rajesh’s Dear Releasing in Telugu: తమిళంలో అనేక సినిమాలకు మ్యూజిక్ అందించి తెలుగులో కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించిన జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ‘డియర్’ అనే సినిమా తెరకెక్కింది. జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’కి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రెండు భాషల్లో విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది.

Samantha: సిటాడెల్ ప్రయాణాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు…సమంత షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులు అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుందని అధికారికంగా ప్రకటించారు. హ్యూజ్ థియేట్రికల్ చైన్ బిజినెస్ ఉన్న ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ సంస్థల బ్యాకింగ్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం కూడా జివి ప్రకాష్ కుమార్ అందించారు, ఇటీవలి చార్ట్‌బస్టర్ పాట “మాస్టారు మాస్టారు” ఇప్పటికీ అందరి ఫోన్లలో మోగుతూనే ఉంది. అలాగే తమిళంలో విడుదలైన రెండు పాటలు చార్ట్‌లలో ఆదరగొడుతున్నాయి. త్వరలో తెలుగులో కూడా విడుదల కానున్నాయి. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version