NTV Telugu Site icon

Gunturu Kaaram: ‘గుంటూరు కారం’ షూటింగ్ అప్డేట్..

Mahesh

Mahesh

Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తీసుకురానున్నారు మేకర్స్. ఇక గుంటూరు కారం షూటింగ్ మూడు షెడ్యూల్స్.. ఆరు వెకేషన్స్ అన్నట్లుగా ఉంది. నిరంతరాయంగా సాగుతున్న షెడ్యూల్స్ కు మధ్య మధ్యలో మహేష్ బ్రేక్ ఇవ్వడం, కుటుంబంతో కలిసి వెకేషన్స్ వెళ్లడం.. మళ్లీ తిరిగి వచ్చాక షూటింగ్ మొదలుపెట్టడం.. జరుగుతూనే ఉంది.

Sharukh Khan : ఆ మహిళా అభిమాని చేసిన పనికి ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్..!!

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇంకా 78 రోజుల షూటింగ్ ను జరుపుకోవాల్సి ఉందట. అంటే దాదాపు.. రెండున్నర నెలలు. ఇప్పటివరకు చేసిన షూటింగ్ కాకుండా ఇంకా రెండున్నర నెలలు అంటే.. ఆగస్టు, సెప్టెంబర్ లో ఈ సినిమా ఫినిషింగ్ కు వస్తుంది. అది కూడా కంటిన్యూగా జరిగితే. మధ్యలో మరోసారి మహేష్ వెకేషన్ అంటే మరింత లేట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ షూటింగ్ కోసం త్రివిక్రమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments