NTV Telugu Site icon

Gunturu Kaaram: టైటిల్ అనౌన్స్మెంట్… బీడీ 3Dలో కనపడతాంది

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబుని వింటేజ్ మాస్ గెటప్ లో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మాస్ స్ట్రైక్ మీకోసమే. మహేష్ నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే వెంటనే హారిక హాసిని రిలీజ్ చేసిన వీడియో చూసేయండి. మీరు మహేష్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఈ నిమిషం నిడివి ఉన్న గ్లిమ్ప్స్ మీకోసం రిపీట్స్ వేసుకోండి. ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న SSMB 28 టైటిల్ రివీల్ అయ్యింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్లే ‘గుంటూరు కారం’ టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ‘మాస్ స్ట్రైక్’ వీడియోని రిలీజ్ చేసారు. అతడు, ఖలేజా సినిమాల్లో మహేష్ బాబుని కొత్తగా ప్రెజెంట్ చేసినట్లే ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ లో కూడా మహేష్ బాబుని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు త్రివిక్రమ్. ఈ కాంబీనేషన్ అప్సెట్ చెయ్యదు అనే నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ ‘గుంటూరు కారం’ వీడియో బయటకి వచ్చింది.

ఒక సూపర్ సాంగ్ తో మొదలైన మాస్ స్ట్రైక్ వీడియో, మహేష్ బాబు బీడీ రజినీ స్టైల్ లో నోటిలో నుంచి తీయడంతో పీక్స్ కి వెళ్లిపోయింది. ‘ఏందీ బీడీ 3Dలో కనపడతుందా” అని మహేష్ యాసలో అడిగిన విధానం ఫాన్స్ కి కిక్ ఇస్తోంది. లాంగ్ హెయిర్ తో, హెడ్ బ్యాండ్ తో మహేష్ మస్త్ ఉన్నాడు. గత పదేళ్లలో ఇది మహేష్ బెస్ట్ లుక్స్ లో ఒకటనే చెప్పాలి. అల వైకుంఠపురములో సినిమా క్లైమాక్స్ లో ‘సిత్తరాల సిరపడు’ టైప్ సాంగ్ ని గుంటూరు కారం ఇంట్రోకి కూడా థమన్ ఈ మాస్ స్ట్రైక్ కి ప్రాణం పోసేసాడు. హారిక హాసిని క్రియేషన్స్ ముందు చెప్పినట్లుగానే మాస్ స్ట్రైక్ ని థియేటర్స్ కి రిలీజ్ చేసారు కానీ డిజిటల్ రిలీజ్ కోసం ఫాన్స్ వెయిట్ చేస్తుండగానే.. థియేటర్స్ నుంచి టైటిల్ అండ్ వీడియో లీక్ అయిపోయి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చేసేదేమి లేక వెంటనే ఆన్ లైన్ లో రిలీజ్ చేసేసారు. సో ఇప్పటి నుంచి SSMB 28, ‘గుంటూరు కారం’గా మారిందన్నమాట.

Show comments