Site icon NTV Telugu

Guntur Kaaram Trailer: ‘సలార్‌’ రికార్డ్‌ని మడతబెట్టిన గుంటూరు కారం!

Guntur Kaaram Trailer

Guntur Kaaram Trailer

రీజనల్ లెవల్లో మహేష్ బాబునే కింగ్ అని మరోసారి గుంటూరు కారం ట్రైలర్ ప్రూవ్ చేసింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‍లో ఉందో మరోసారి రుజువైంది. 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి దుమ్మురేపింది గుంటూరు కారం ట్రైలర్‌. యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ‘సలార్’ రికార్డును బ్రేక్ చేసింది ‘గుంటూరు కారం’ ట్రైలర్. 24 గంటల్లో ‘సలార్’ ట్రైలర్‌ 32 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉండగా… ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే హైయ్యస్ట్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే జోష్‌లో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెడీ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం సాయంత్రం ఐదు గంటల నుంచి గుంటూరులో భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నంబూరు ఎక్స్ రోడ్స్ గ్రౌండ్‌లో ఈ వేడుక జరగనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది గుంటూరు కారం. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో… రీజనల్ లెవల్లో గుంటూరు కారం రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం గ్యారెంటీ. మరి సంక్రాంతికి రమణ గాడు చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version