Site icon NTV Telugu

Guntur Kaaram: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. రిలీజ్ పక్కా ఆరోజే!

Guntur Kaaram Shooting Upda

Guntur Kaaram Shooting Upda

Guntur Kaaram shoot Update: 12 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. గుంటూరు కారం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్లో 28వ సినిమా. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఎస్ చినబాబు, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న ప్రకారం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్‌లో నిరంతర జాప్యం తర్వాత ఇప్పుడు గుంటూరు కారం టీమ్ జూలై నుండి నాన్‌స్టాప్ షెడ్యూల్ చేయడానికి ప్లాన్ చేసింది. ఎందుకో కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకరకంగా వాయిదా పడుతూనే వస్తోంది. ముందుగా చెప్పిన కథను మార్చమని మహేష్ కోరడంతో స్క్రిప్ట్ మార్చడం వల్ల షూట్ ఆలస్యం అయింది. తరువాత మహేష్ తల్లి, తండ్రి మరణించడం, మహేష్ గ్యాప్ కోరడంతో మరింత వాయిదా పడుతూ వచ్చింది.
MM Keeravani: ‘చిరు’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీరవాణి.. ఇక బాక్సులు బద్దలే!
ఇక ఈ నెల 12 న ఒకసారి 20వ తేదీన ఒకసారి షూట్ సెట్ చేయగా డేట్స్ ఇబ్బంది వల్ల క్యాన్సిల్ అయింది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ సెట్ అయిందని తెలుస్తోంది. ఈ నెల 25న సినిమా షూట్ కోసం షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సీన్స్ షూట్ చేస్తూ ఒక నెలలో షూటింగ్ పూర్తి చేసి, అనుకున్న ప్రకారం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా యూనిట్ నిర్ణయించుకుంది . సినిమా టీమ్ ఎటువంటి విరామం లేకుండా షూట్ చేయాలని భావిస్తున్నారు, టీమ్ ప్లాన్ ప్రకారం అందరి ఆర్టిస్టుల డేట్‌లను లాక్ చేసి ఈసారి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో భారీ హౌస్‌ సెట్ ని ఏర్పాటు చేసి ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు, షూట్‌లో ఇకపై జాప్యం జరగకూడదని, నవంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Exit mobile version