NTV Telugu Site icon

Guntur Kaaram: అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది

Sree

Sree

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ధం మసాలా బిర్యానీ.. రికార్డ్ సృష్టిస్తోంది. ఇక ధం మసాలా బిర్యానీ లాంటి మాస్ సాంగ్ తో మెస్మరైజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఒక లవ్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఓ మై బేబీ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది అని మహేష్ బాబు.. శ్రీలీల తో అనడం.. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఈ ప్రోమోలో కనిపించింది. ఇక గుంటూరు వెళ్లిన శ్రీలీల.. మహేష్ తో ఎలా ప్రేమలో పడింది.. ఓ మై బేబీ అంటూ అతగాడిని ఎలా తన ప్రేమ భావాలను చూపించింది అనేది ఈ సాంగ్ లో చూపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. డిసెంబర్ 13 న ఓ మై బేబీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ప్రోమోలో శ్రీలీల లంగా ఓణీలో అచ్చతెలుగు ఆడపిల్లలా మెరిసిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.