తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబోలో సినిమా కావున ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్లు చాలా కాలం తర్వాత మహేష్ బాబును పోకిరి తరహాలో పాత్రలో చూసించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. గతేడాది సర్కారు వారి పాట మూవీలో కూడా మాస్ లుక్ లో కనిపించాడు మహేష్ బాబు..
ఇప్పుడు ఈ సినిమాలో కూడా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు.. పక్కా మాస్ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలను పెంచేలా వరుస అప్డేట్స్ ను వదులుతున్నారు.. తాజాగా మరో అప్డేట్ ను రిలీజ్ చేశారు.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రేపు (ఈ నెల 9 )న గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్డులో నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటి వరకు 25 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది..
ఈ సినిమా బిజినెస్ ను చూస్తే.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా థియేట్రికల్ రైట్స్‌కు దాదాపుగా రూ. 120 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 155 కోట్లకు క్లోజ్ అయినట్టు సమాచారం. ఓ రీజినల్ సినిమాకు ఇది ఓ భారీ రికార్డు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటించారు.. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ నటులు సునీల్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మహేష్ బాబు రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకున్నట్లు తెలుస్తుంది..
