సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది.. కాగా నేడు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో మూవీ నుంచి ఏదొక అప్డేట్ వస్తుందని ఎంతో ఆసక్తి చూస్తున్నారు. కానీ ఈ సినిమా నుంచి మాత్రం ఎటువంటి యాక్టివిటీ కనిపించకపోవడంతో అభిమానులు అంతా నిరాశ చెందారు.
అయితే ఈసారి మాత్రం మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ ను ఇస్తారన్న ఆశతో ఉన్నారు టీమ్. అయితే ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్ తన సినిమాల అప్ డేట్‌లని ఇంత వరకు ఇస్తూ వచ్చారు. బుధవారం మహేష్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న నేపథ్యంలో `గుంటూరు కారం` నుంచి బిగ్ అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే వారందరికీ హుషారుని ఇచ్చేలా మూవీ టీం ఒక అప్డేట్ ఇచ్చింది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ లకు జనాల్లో హైప్ ను క్రియేట్ చేశాయి.. ఇక తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ లో మహేష్ లుక్ లో మాస్ లుక్ కనిపిస్తున్నాడు.. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది.
గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి సాంగ్ రిలీజ్ చేస్తారా? అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అసలు ఆవిరి అయ్యాయి.. సినిమాలోని మరో లుక్ ను మేకర్స్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేశారు.. ఈ సినిమాలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శరేవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేసేందుకు మూవీ టీం గట్టిగా ప్రయత్నిస్తుంది. అయితే మూవీ షూటింగ్ కి పడుతున్న బ్రేక్స్ చూస్తుంటే.. సంక్రాంతి రిలీజ్ కష్టమని టాక్ వినిపిస్తుంది. మరి త్రివిక్రమ్ అండ్ మహేష్ ఏమి చేస్తారో చూడాలి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.. కానీ ఇప్పుడు పోస్టర్ తో పాటు సంక్రాంతికి రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇస్తూ జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అని ప్రకటించారు.