Guntur Kaaram: ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెగెటివ్ గానో.. పాజిటివ్ గానో పక్కన పెడితే.. ట్విట్టర్ మొత్తం దాని గురించే మాట్లాడుకుంటుంది. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి సాంగ్ ఊహించలేదని కొందరు.. మహేష్ బాబు ఇలాంటి బూతు అంటాడని అనుకోలేదని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి డైలాగ్స్ ను తీసుకొని సాంగ్ చేసే పరిస్థితికి టాలీవుడ్ వచ్చిందా అని ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. పక్కన పెడితే .. కొద్దిసేపటి క్రితం కుర్చీని మడతపెట్టి ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మహేష్, శ్రీలీల డ్యాన్స్ కుమ్మేశారు. అయితే లిరిక్స్ మొత్తం ఐటెం సాంగ్ లా ఉన్నాయి. హీరో, హీరోయిన్ కు మధ్య వచ్చే సాంగ్ లా అనిపించడం లేదు.
రాజమండ్రి రాజమందిరి..మాయమ్మ పేరు తలవనోరు లేరు మేస్త్రిరి..కళాకారుల ఫ్యామిలీ మరి..నే గజ్జ కడితే నిదురపోదు నిండు రాతిరి ఈ లిరిక్స్ వింటే.. ఇదో ఐటెం సాంగ్ లా కనిపిస్తుంది. చరణం లో కూడా దానికేమో మేకలు ఇస్తివి నాకేమో నూకలు ఇస్తివి అని రాసుకొచ్చారు. దీంతో శ్రీలీల హీరోయిన్ నా.. ? లేక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందా అనే అనుమానం వచ్చింది. అయితే దీనికి సమాధానం దొరికింది. ఆ లిరిక్స్ శ్రీలీల గురించి కాదంట.. ఈ సాంగ్ లో నటి పూర్ణ నటిస్తోంది. ఆమెను రివీల్ చేయకుండా మొత్తం శ్రీలీలనే చూపించడంతో ఆ లిరిక్స్ ఆమెమీదనే అని అనుకుంటున్నారు. అయితే చివర్లో పూర్ణ కనిపించడంతో వీటికి తెరపడింది. దీంతో గురూజీ సర్ ప్రైజ్ బావుంది కానీ, ఇంకో హీరోయిన్ ను పెడిది బావుండేది అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
