Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కలక్షన్స్ పరంగా రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్, డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తల్లి కోసం ఒక కొడుకు ఏం చేశాడు అన్నది గుంటూరు కారం సినిమా. ఇక ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఒక గెస్ట్ పాత్రలో కనిపించింది. థమన్ మ్యూజిక్.. సినిమా మొత్తం ఏమో కానీ, కొన్ని సాంగ్స్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఈ సినిమా వచ్చి 15 రోజులు దాటుతుంది. దీంతో సినిమా నుంచి ఒక్కో వీడియో సాంగ్ ను రిలీజ్ చేస్తూ.. ఓటిటీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇప్పటికే రమణ ఏయ్, అమ్మ సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇక తాజాగా ధమ్ మసాలా బిర్యానీ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మాస్ బీట్ కు అందుకు తగ్గట్టే మహేష్ మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ఓటిటీలో అడుగుపెట్టనుంది. మరి థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న గుంటూరు కారం ఓటిటీలో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
