Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లోనే మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తోంది. నిన్ననే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మీదనే నిర్మిస్తోంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని ఇప్పటికే తేలిపోయింది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు సమంత రూమర్డు బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
Read Also : Khaidi : చిరంజీవి ఖైదీకి 42 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న హీరో అతనే
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ వన్ ధియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ మూవీలో విలన్ గా చేసిన గుల్షన్ దేవయ్య ఇప్పుడు సమంత సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఆయనతో నందిని రెడ్డి చర్చలు కూడా అయిపోయాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుల్షన్ దేవయ్య గతంలో బాలీవుడ్ లో పలు సీరియళ్లు, సినిమాల్లో కనిపించాడు. అతని నటనకు మంచి క్రేజ్ ఉంది. కాంతర సినిమాలో ఆయన నటనపై మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పుడు సమంత సినిమాలో ఆయన ఉన్నాడని తెలిసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Read Also : Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ
