NTV Telugu Site icon

Avatar 2: అవతార్ 2 మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. చెప్పింది ఎవరో తెలుసా..?

Avatar

Avatar

Avatar 2:అవతార్ 2 సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. జేమ్స్ కామెరూన్ అద్భుతమైన సృష్టిని చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.అవతార్ 2 డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల కానునం సంగతి అందరికి తెల్సిందే. ఇక ఈ సినిమా బుకింగ్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే వచ్చే నెల రిలీజ్ అయ్యే ఈ సినిమా మొదటి రివ్యూ ఇప్పుడే వచ్చేసింది. ఇచ్చింది కూడా అల్లాటప్పా వ్యక్తి కాదు ఆస్కార్ గ్రహీత.. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో. ఆయన ఇప్పటికే అవతార్ 2 సినిమాను వీక్షించారట.

“ఇది అత్యద్భుతమైన విజయం.. గంభీరమైన .. భావోద్వేగాలతో కూడుకున్న గొప్ప సినిమా.. అవతార్ 2. ఇది నన్ను పురాణ ఇతిహాసాన్ని చూస్తున్నంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది” జేమ్స్ కామెరూన్ రాజా ముద్ర, ఆమోద ముద్ర అన్నట్లు టాగ్స్ పెట్టాడు. ఇక దీంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండనున్నదో అభిమానులు ఉహించుకోవాల్సిందే. ఒక ఆస్కార్ అవార్డు విన్నర్.. ఇంకో డైరెక్టర్ గురించి, ఆ సినిమా గురించి ఈ విధంగా మాట్లాడాడు అంటే ఆ సినిమా లో ఉన్న సత్తా అలాంటిది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments