Kannappa : కన్నప్ప మూవీ విషయంలో అధికారులు జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు సహా, మూవీకి చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా ఏమీ స్పందించలేదు. అయితే రీసెంట్ గా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీ బడ్జెట్ గురించి చెబితే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడుతారని చెప్పాడు.
Read Also : Mahesh Babu : అనగనగా మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు..
ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన అన్నట్టే ఇప్పుడు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయం మాత్రం ఇంకా బయటకు చెప్పలేదు. మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సమయంలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారిపోయింది.
