NTV Telugu Site icon

Narakasura: నిందాస్తుతిలో శివుడ్ని ప్రశ్నిస్తున్న పలాస హీరో

Greevamu Yanduna

Greevamu Yanduna

Greevamu Yanduna Song launched: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ మీద డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తుండగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా “నరకాసుర” సినిమా నుంచి ‘గ్రీవము యందున’ అనే లిరికల్ సాంగ్ ని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. తమ సినిమాలో ‘గ్రీవము యందున..’ పాటను రిలీజ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరంకు “నరకాసుర” టీమ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్పారు.

Sunainaa: హెల్త్ అప్డేట్ ఇచ్చిన సునైనా.. ఆమెకు ఇప్పుడెలా ఉందంటే?

ఇక వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ఏఐఎస్ నాఫాల్ రాజా బ్యూటిఫుల్ కంపోజిషన్ లో స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. ‘గ్రీవము యందున కాలమునే..కంఠము యందున గరళమునే.. దాచిన దానవ పక్షమువే..మా యడ న్యాయము మరచితివే..’అంటూ నిందాస్తుతిలో పరమ శివుడిని ప్రశ్నిస్తూ పాట సాగుతుంది. శివభక్తుల గెటప్ లతో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు పొలాకి విజయ్ ఆకట్టుకునే కొరియోగ్రఫీ చేయగా నరకాసుర చిత్రంలో కీలక సందర్భంలో ఈ పాట వస్తుందని, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని “నరకాసుర” మూవీ టీమ్ చెబుతోంది. శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రక్షిత్ కి మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కానుంది.