NTV Telugu Site icon

Dulquer Salmaan : లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్

Dulquer

Dulquer

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన దుల్కర్.. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనే స్థాయికి ఎదిగాడు. చెప్పాలంటే మాలీవుడ్ కన్నా తెలుగు, తమిళంలో పాపులరయ్యాడు ఈ యాక్టర్. టాలీవుడ్ ప్రేక్షకులైతే సొంత హీరోలానే భావిస్తుంటారు. మహానటి నుండి దుల్కర్ మరింత చేరువయ్యాడు. అందుకే డబుల్ మైలేజ్ ఇచ్చిన టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కల్కిలో దుల్కర్ చేసిన చిన్న రోల్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

Also Read : Pradeep Ranganathan : మరోసారి వందకోట్ల క్లబ్ లో యంగ్ హీరో

ప్రజెంట్ దుల్కర్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తమిళంలో కాంత చేస్తున్నాడు. ఇందులో నయా బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్‌గా చేస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న కాంతకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే తెలుగులో స్వప్న సినిమాపై ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు. పవన్ సాదినేని దర్శకుడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా రాబోతున్నాయి. అంతేకాదు లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటు తెలుగు, తమిళ పీపుల్ తో టచ్ లో ఉంటే మాలీవుడ్ కోసం కూడా ఓ మూవీకి కమిటయ్యాడు. ఆర్డీఎక్స్ ఫేం నహాస్ హిదాయాత్ దర్శకత్వంలో ‘ఐయామ్ గేమ్’ చేస్తున్నాడు. రీసెంట్లీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కింగ్ ఆఫ్ కోత తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి వస్తున్న మూవీ కావడం వల్ల కేరళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హయ్యర్ అంచనాలున్నాయి.