ప్రతాప్ పోతన్ కీలక పాత్రధారిగా ‘గ్రే’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు దశాబ్దాలకు పైగా దక్షిణాది భాషా చిత్రాలలో నటిస్తున్నాడు ప్రతాప్ పోతన్. పాత్రను ఆకళింపు చేసుకుని తనదైన బాణీలో దానిని తెర మీద ప్రెజెంట్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఇప్పటికీ ప్రతాప్ పోతన్ ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితంతో సచిన్ జోషి ‘వీడెవడు’ చిత్రంలో నటించిన ప్రతాప్ పోతన్ మరోసారి తెలుగు సినిమా ‘గ్రే’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కల్లాకురి నిర్మిస్తున్నారు. అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ‘గ్రే’ చిత్రానికి ‘ద స్పై హూ లవ్డ్ మి’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి, ప్రసాద్ లాబ్ లో గుమ్మడికాయ కొట్టారు.
Read Also : రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్
Also Read
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ, ”ఇదొక స్టైలిష్ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు టర్నులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. 20 రోజుల పాటు నిర్విరామంగా హైదరాబాద్‌లోని పలు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. నిర్మాత కిరణ్‌గారు పూర్తి సహకారం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఔట్‌పుట్ పట్ల మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను“ అన్నారు. నాగరాజు తల్లూరి ‘గ్రే’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!