రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్

తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. హిందీలో ఈ సినిమాను అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు దర్శకనిర్మాతలు.

Read Also : 25న రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్

తెలుగులో ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కిన నేపథ్యంలో బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ సక్సెస్ తో ఫుల్ జోష్‌ లో ఉన్న షాహిద్ ‘జెర్సీ’ రీమేక్ పై కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. మరి వారందరి నమ్మకాన్ని బాలీవుడ్ ‘జెర్సీ’ ఎంత వరకూ నిలబెడుతుందో చూద్దాం.

Related Articles

Latest Articles