నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన “జెర్సీ” చిత్రం ఇప్పుడు అదే పేరుతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాగా, అంతకుముందే విడుదల కావాల్సిన ‘జెర్సీ’ చాలాసార్లు వాయిదా పడింది. ‘KGF – 2’ ఇప్పటికీ బాక్సాఫీస్‌ని శాసిస్తున్న సమయంలో ‘జెర్సీ’ని విడుదల చేసి మేకర్స్ రిస్క్ తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది.
Read Also : NTR 30 : అలియాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్… స్టోరీ ఇదేనట !
ఏప్రిల్ 22న ముంబైలో హిందీ “జెర్సీ” ప్రీమియర్ షోలను ప్రదర్శించగా, షో అనంతరం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి క్రిటిక్స్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షాహిద్ కపూర్ విడుదల చేయగా, నెట్టింట్లో వైరల్ అవుతోంది. గౌతమ్ ‘జెర్సీ’తో ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసారు. మరోవైపు నటీనటులపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గౌతమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్‌తో ఉండబోతోందని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
Hats Off @gowtam19 bhayya 👏👏
Congratulations on the amazing response for #Jersey !! 🥳 👏#GowtamTinnanuri #Jersey pic.twitter.com/F0A3PzBSgR
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 22, 2022
