పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించగా.. తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. కాగా వినాయక్ ఇదివరకు గెస్ట్ పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్-రానా సినిమాలోనూ వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ జులైలో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
పవన్ సినిమాలో గెస్ట్‌గా ప్రముఖ దర్శకుడు!
