NTV Telugu Site icon

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. తగ్గేదే లేదంటున్న వెంకటేష్!

Venkatesh

Venkatesh

2025 సంవత్సరానికి గాను రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఏ ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు విక్టరీ వెంకటేష్ తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రొడక్షన్ నుంచి రెండో సినిమా ఆపేయమని ఇతర నిర్మాతలు నుంచి ప్రెషర్ ఉండొచ్చు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి.

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ. కోటి నజరానా..కర్ణిసేన ఆఫర్..

అయితే ఈ విషయంలో పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేమంటే ఈ సినిమాని సంక్రాంతి నుంచి వెనక్కి వాయిదా వేయడానికి హీరో విక్టరీ వెంకటేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. కచ్చితంగా తమ సినిమా టైటిల్ కి తగ్గట్టు సంక్రాంతికి దిగాల్సిందే అని చెబుతున్నారట. ఎందుకంటే సినిమా మొత్తం సంక్రాంతి నేపథ్యంలో సాగే సినిమా కావడం ముఖ్య కారణం. దానికి తోడు సినిమా టైటిలే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టాం దానికి తోడు ఎలా అయినా సంక్రాంతికి రిలీజ్ చేయాలని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాం ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి సినిమాని తప్పిస్తాననడం కరెక్ట్ కాదని ఆయన చెప్పడంతో దిల్ రాజు కూడా అందుకు కాస్త కన్విన్స్ అయ్యాడని తెలుస్తోంది.

ఒకరకంగా వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకి సంక్రాంతి సీజన్ గతంలో చాలా సార్లు మంచి హిట్లను తెచ్చి పెట్టింది. దానికి తోడు ఈసారి నందమూరి బాలకృష్ణ లాంటి హీరోతో పోటీ పడుతూ ఉండడం కూడా ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ పరిస్థితి. ఇలా ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు వచ్చిన ప్రతిసారి ఆ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.. దానికి తోడు వెంకటేష్ కి సంక్రాంతి కలిసొస్తుందని సెంటిమెంట్ ఎటూ ఉండనే ఉంది. కాబట్టి ఈ విషయంలో దిల్ రాజు అనిల్ రావిపూడి కూడా ఒకసారి ఆలోచిస్తే సంక్రాంతి సినిమా బరిలోకి దిగటం పెద్ద కష్టమేమీ కాదు. అలా ఈ సినిమాని జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్ లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Show comments