NTV Telugu Site icon

Anchor Soumya Rao: జబర్దస్త్‌ షో నుంచి అందుకే వెళ్ళిపోయ యాంకర్ సౌమ్యరావ్

Maxresdefault

Maxresdefault

Soumya Rao’s Statement on Leaving Jabardasth: ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై కామెడీతో అలరిస్తూ, కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఈ షోతో ఎంతో మంది కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు వెండితెరపై తమ సత్తాను చాటుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆదితో సహా పలువురు కమెడియన్స్ బిగ్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. అలాగే ఇందులో మొదట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ సైతం బిజీగా మారిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లు రావడం వలన ఈ షో నుండి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాని తరువాత ఆమె యాంకర్‌ ప్లేసు రీప్లేస్ చేస్తూ కన్నడ సీరియల్ నటి అయిన సౌమ్యరావ్ ఎంట్రీ ఇచింది. ఆమెకి తెలుగులో మాట్లాడటం కష్టం అయినప్పటికీ తన టైమింగ్ తో చాలా చక్కగా యాంకరింగ్ చేస్తూ తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎన్నో సంవత్సరాలు యాంకర్ చేస్తుంది అనుకున్న ఆమె ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా జబర్దస్త్ షో నుంచి కనిపించకుండా పోయింది.

Also Read: Pawan Kalyan: భారత అంతరిక్ష రంగ పితామహుడి జీవితం స్ఫూర్తిదాయకం

అయితే చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో తెలియలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకుంది ఆమె. జబర్దస్త్ నుండి సడెన్‌గా కనుమరుగవ్వడంతో వాళ్లు తీసేశారా, మీరు వెళ్లిపోయారా అన్న ప్రశ్న ఎదురు కాగా, ఆ షో లో అగ్రిమెంట్ అయిపోయింది అందుకే క్విట్ అయ్యానని చెప్పింది. ‘వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు.. నెక్ట్స్ ఇయర్ కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా. అక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకు వచ్చి, క్యాబ్ వంటి సౌకర్యాలిచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. టీమ్ లీడర్స్, జడ్జస్, ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ బాగా చూసుకున్నారు’ అని పేర్కొంది.

కానీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేయడం వదులుకున్నాను. మళ్లీ మంచి ఆఫర్స్ వస్తే వెళతాను. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే..? జీవితంలో ఒక కంపెనీపై, ఒకరిపై ఎపుడు ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో ఆ దారుల్లో వెళ్లిపోవాలి. ఈ దారి బాగుంది.. ఇందులోనే వెళ్లాలని ఓ ఆర్టిస్టు అనుకోకూడదు. ఆ దారిని ఎప్పుడు, ఎవరు, ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చింది. హోస్టుగా రాణించాలంటే గ్లామర్ అవసరం లేదని, మంచిగా మాట్లాడాలి, టైమింగ్ బాగుండాలి, అట్ట్రాక్ట్ చేయగలగాలి’ అని చెప్పింది.

Also Read: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి

ఇక్కడ ఇండస్ట్రీ కి కన్నడ ఇండస్ట్రీ కి ఏమైనా తేడాలు కనిపించాయా అని అడగగా కన్నడ ఇండస్ట్రీ లో తనకు ఎదురైనా ఒక చేదు సంగటన చెప్పుకొచ్చింది. సీరియల్ లో సైడ్ క్యారెక్టర్ చేసే రోజుల్లో ఒకరోజు ప్రొడక్షన్ హౌస్ లో భోజనం చేయడానికి వెళ్ళినపుడు అనుకోకుండా ఒక బాక్స్ లో స్వీట్ వేసుకున్న అని దానివల్ల కొంతమంది తనని దరిద్రపుదాన హీరోయిన్ కోసం తెచ్చిన బాక్స్ ఎందుకు ముట్టుకున్నావు ఎవరు పడితే వారి తినడానికి కాదు ఇది హీరోయిన్ గారి కోసం నీకు కళ్ళు కనపడటం లేదా అక్కడ బాయ్స్ వడ్డిస్తున్నరు కదా అక్కడకి వెళ్లి తిను అంటు చాలా చులకనగ చేసి మాట్లాడారు అని చెప్పుకొచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో చాలా బాగా చూసుకున్నారు అని ప్రస్తుతం కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ షోలో చేస్తున్న ఇంక ఏమైనా మంచి ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది