NTV Telugu Site icon

Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్

Nc

Nc

Samantha Dhulipalla Reveals The Secret: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇటీవల రెండు రోజుల క్రితం(ఆగష్టు 8) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటికే ఏదో విషయమై మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్లు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారనేది రివీల్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఇంకో రెండు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. అదేమిటి అంటే శోభిత ధూళిపాళకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి పేరు కూడా సమంతనే అని తెలియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Tollywood: చిన్న సినిమా.. రీసౌండ్ వచ్చేలా కలెక్షన్స్.. ఏమిటా సినిమా..?

శోభిత చెల్లి సమంత డాక్టర్ గా పనిచేస్తుంది.అయితే ఇదే వరకే ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయింది. ఇక ఆమె తాజాగా నాగచైతన్య – శోభిత నిశ్చితార్థం ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయం తెలిపింది. సమంత ధూళిపాళ నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికి.. అని పోస్ట్ చేసింది. దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గానే చెప్పేసింది. అలానే సమంత ధూళిపాళ్ల పోస్ట్ చేసిన ఓ ఫొటోకు చైతూ లైక్ కూడా కొట్టాడు. కాకపోతే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు.