‘బంగార్రాజు’లో పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నది ఓ సామెత. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొందరు! 2016లో సంక్రాంతి కానుకగా వచ్చి, జయకేతనం ఎగరేసింది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వస్తుందని అప్పట్లోనే చెప్పారు. అయితే అది ఈ యేడాది మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తోనే ఈ మూవీ ఉంటుందని నాగార్జున సైతం అధికారికంగా ప్రకటించారు. అయితే… ఇంకా ముహూర్తం జరుపుకోని ఈ సినిమా స్టార్ కాస్టింగ్ పై రోజుకో వార్త వస్తోంది. ఇది ప్రధానంగా బంగార్రాజుకు సంబంధించిన కథతో సాగుతుందని అంటున్నారు. గ్రంధసారుడైన బంగార్రాజు క్యారెక్టర్ ను తెలియచేయడం కోసం ఈ మూవీలో ఐటమ్ భామాల జాబితా భారీగా ఉండే ఛాన్స్ ఉందట. సొగ్గాడే చిన్నినాయనాలో అనసూయతో అదరిపోయే స్టెప్పులేయించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ లో పాయల్ రాజ్ పుత్ తో ఐటమ్ సాంగ్ చేయించబోతున్నాడని తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా…. ఐటమ్ సాంగ్స్ చేయడానికి సైతం పాయల్ సై అంటోంది. అందుకు ఉదాహరణగా తేజ డైరెక్ట్ చేసిన సీత మూవీనే చెప్పుకోవచ్చు. అలానే పాత్రలకు పెద్దంత ప్రాధాన్యం లేకపోయినా… ఒకటి రెండు పాటలతో సాగే పాత్రయినా… అది స్టార్ హీరో మూవీ అయితే చాలు పాయల్ ఓకే చేస్తోంది. సో… ఆ రకంగా బంగార్రాజులో అవకాశం దక్కాలే కానీ పాటకైనా పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. కానీ అసలీ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాలి.
Also Read
తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!