NTV Telugu Site icon

Balakrishna: నందమూరి వంశంలో మొదటిసారి.. బాలయ్య కూతురు టాలీవుడ్ ఎంట్రీ..?

Bala

Bala

Balakrishna:నందమూరి వంశం నుంచి ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీకు వెచ్చించి లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు ఆ వంశం నుంచి హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అందులో 5 గురు అమ్మాయిలు. ఇక ఈ సంతానానికి పెళ్లిళ్లు అవ్వడం, వారికి అమ్మాయిలు పుట్టడం.. వారికి కూడా పెళ్లి అవ్వడం చూసాం కానీ ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు అని కానీ, అసలు పెడతారా అన్న ఆలోచన కానీ ఎవరికి రాలేదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే నందమూరి బాలకృష్ణ కూతుళ్లు.. ఇద్దరు అందగత్తెలే .. బ్రాహ్మణి, తేజస్విని.. హీరోయిన్లకు ఈ మాత్రం తీసిపోనిఅందం వారి సొంతం.. కానీ వీరు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లేదు. ప్రస్తుతం బ్రహ్మణి, చంద్రబాబు ఇంటి కోడలిగా, హెరిటేజ్ సంస్థ బాధ్యతలను చూసుకొంటుంది.

మరోపక్క తేజస్విని భర్త వ్యాపారాలతో పాటు తండ్రి క్యాస్టూమ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షో కు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొట్టమొదటిసారి తేజస్విని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నదట. అయితే నటన పరంగా కాదు కానీ నిర్మాణపరంగా చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నదట. అదేనండీ నిర్మాతగా మారనుందట. తండ్రితో కలిసి ఒక పొలిటికల్ డ్రామాను తీయడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ కంపెనీస్ నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు తేజస్విని తో కలుపుకొని మూడోది రాబోతుంది. మరి ఈవార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.