Site icon NTV Telugu

“లక్ష్య” దర్శకుడికి షాక్ ఇచ్చిన నాగశౌర్య

The Climax shoot of Lakshya has begun today

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య “లక్ష్య” అనే విలు విద్య ఆధారిత స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. “లక్ష్య” సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. శౌర్య లక్ష్య దర్శకుడు సంతోష్ జాగర్లమూడికి కొన్ని క్రియేటివ్ ఇన్‌పుట్‌లను ఇచ్చాడట. దర్శకుడు ఈ ఇన్‌పుట్‌లను తీసుకుని స్క్రిప్ట్‌ను తదనుగుణంగా రూపొందించారు. నటులు దర్శకులకు ఇన్‌పుట్‌లు ఇవ్వడం కొత్త ట్రెండ్ కాదు.

Read Also : యూరోప్ కు “ఆర్ఆర్ఆర్” టీం ప్రయాణం

టాలీవుడ్‌లోని దాదాపు ప్రతీ నటుడు… అది టాప్ స్టార్ అయినా మీడియం రేంజ్ హీరో అయినా తమ దర్శకులకు సృజనాత్మకమైన ఇన్‌పుట్‌లను ఇస్తూనే ఉంటారు. కానీ వారు దీనికి క్రెడిట్ ను ఆశించరు. అయితే నాగ శౌర్య విషయంలో దీనికి భిన్నంగా జరిగిందట. “లక్ష్య” స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులను సూచించిన శౌర్య అందుకు తనకు అదనపు స్క్రీన్ ప్లే రైటర్ క్రెడిట్ కావాలని డిమాండ్ చేశాడట. అతని డిమాండ్ దర్శకుడు సంతోష్‌ని షాక్‌కు గురి చేసిందని అంటున్నారు. కేవలం కొన్ని ఇన్‌పుట్‌లను అందించినందుకు శౌర్య స్క్రీన్ ప్లే రైటర్ గా క్రెడిట్‌లను అడుగుతారని దర్శకుడు ఊహించలేదట. శౌర్య డిమాండ్‌పై ఎలా స్పందించాలో ఆయనకు అర్థమా కావట్లేదని అంటున్నారు.

Exit mobile version