Mrunal Thakur and Yashasvi Jaiswal: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మరోసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఈసారి ఆమె పేరు భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో ముడిపడటం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
ఈ ఊహాగానాలకు కారణమైన ఘటన ముంబైలోని ఓ ప్రముఖ కేఫ్ వద్ద చోటుచేసుకుంది. ముందుగా మృణాల్ ఠాకూర్ ఆ కేఫ్‌లోకి వెళ్లినట్లు వీడియోల్లో కనిపించింది. కొంత సమయం తర్వాత అదే కేఫ్ నుంచి యశస్వి జైస్వాల్ బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు. అనంతరం ఆయన తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరూ కలిసి సమయం గడిపారని, ప్రేమలో ఉన్నారని నెటిజన్లు ఊహించడం ప్రారంభించారు. అయితే, ఒకే ప్రదేశంలో కనిపించడం వల్లే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారు ఏదైనా ప్రకటన చిత్రీకరణ, బ్రాండ్ ప్రమోషన్ లేదా వృత్తిపరమైన సమావేశం కోసం కలిసివుండే అవకాశం కూడా ఉందని కొందరు పేర్కొంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం వైరల్‌గా మారిపోతుంది..
అయితే, మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ మధ్య సుమారు తొమ్మిదేళ్ల వయసు తేడా ఉండటం కూడా నెటిజన్ల చర్చకు కారణమైంది. కొందరు దీనిపై కామెంట్లు చేస్తుండగా, మరికొందరు వ్యక్తిగత జీవితంపై అనవసర ఊహాగానాలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ గానీ, యశస్వి జైస్వాల్ గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ఊహాగానాలుగానే పరిగణించాలి. ఈ వార్తలను స్వతంత్రంగా ధృవీకరించే ఆధారాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా, మృణాల్ ఠాకూర్ పేరు గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులతో ముడిపడింది. ముఖ్యంగా నటుడు ధనుష్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వార్తలు, పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆ వార్తలను ఆమె సన్నిహితులు పూర్తిగా ఖండించారు. వృత్తిపరంగా మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన నటనతో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇటీవల విడుదలైన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో కనిపించారు. మరోవైపు, యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ జట్టులో యువ ప్రతిభావంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న డేటింగ్ రూమర్స్‌పై ఈ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

