Site icon NTV Telugu

త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో నయన్ తళుక్కుమందట!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా గుర్తుండిపోయే చిత్రాలుగా రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కథానాయికపై రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా మరో సీనియర్ కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, సూపర్ స్టార్ మహేష్ పక్కన ఈ కథకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అయితే మహేష్ సరసన నయన్ ఏ మేరకు స్క్రీన్ ఫెయిర్ సెట్ అవుతుందో.. లేదో అనే ఆలోచనలో పడ్డారట.. దీనిపైనా త్వరలోనే స్క్రీన్ టెస్ట్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ గతంలోనూ కథకు తగ్గట్టు సైడ్ క్యారెక్టర్స్, హీరోయిన్స్ లను తీసుకొచ్చిన సందర్భాలు అనేకం.. దీంతో మహేష్ సినిమాలో నయన్ ను దించడంలో పెద్దగా ఆశ్చర్యం పోనవసరం లేదని సినీవిశ్లేషకుల అభిప్రాయం..!

Exit mobile version