Site icon NTV Telugu

Gopichand: నిజంగా ‘రామబాణం’లాగే ఉన్నాడు…

Ramabanam

Ramabanam

లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ చేస్తున్న మూడో సినిమా ‘రామబాణం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే ‘లక్ష్యం’ సినిమా రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ గా నిలిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషన్స్ ని మంచి స్వింగ్ లో చేస్తున్న చిత్ర యూనిట్, ట్రైలర్ లాంచ్ రెడీ అయ్యారు. రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్ లో ఏప్రిల్ 20న రామబాణం ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మ్యాసివ్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు, ఇందులో గోపీచంద్ ఉబెర్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. యజ్ఞం సినిమా నుంచి ఇప్పటికే అదే ఫిజిక్ ని మైంటైన్ చెయ్యడం గోపీచంద్ కి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆరు అడుగులు బుల్లెట్ లా పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో గోపీచంద్ యూత్ కి ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్నాడు. మరి ప్రస్తుతం గోపీచంద్ ఉన్న ఫ్లాప్ స్ట్రీక్ ని ‘రామబాణం’ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Read Also: Tollywood: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!

Exit mobile version