Site icon NTV Telugu

Gopichand: అన్ స్టాపబుల్ షార్ట్ గ్లింప్స్.. ప్రభాస్ చేతిలో గోపీచంద్ బలి

Gopichand

Gopichand

Gopichand: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఇక ఈ షో లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన విషయం తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. షూటింగ్ అయినా ఇంకా స్ట్రీమింగ్ డేట్ ఇవ్వకపోగా ప్రభాస్ స్పెషల్ గ్లింప్స్ అని, గోపీచంద్ స్పెషల్ గ్లింప్స్ అని వీడియోలు రిలీజ్ చేసి ఇంకా ఊరిస్తున్నారు ఆహా యాజమాన్యం.. మొన్నటికి మొన్న ప్రభాస్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా గోపీచంద్ షార్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ప్రభాస్ టాస్క్ ఆడుతుండగా వెనుక నుంచి గోపీచంద్ ఎంట్రీ అదిరిపోయింది. ఇక బాలయ్య, గోపీచంద్ ఒక పార్టీ, ప్రభాస్ ఒక్కడే ఒక పార్టీ అన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రభాస్ గురించిన సీక్రెట్ ను గోపీచంద్ రివీల్ చేయడం.. ప్రభాస్ ఒరేయ్ అని అందంతో వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఎలాంటిదో అర్ధమవుతోంది. ఇక చివర్లో ప్రభాస్, గోపీచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాలయ్య గోపీచంద్ కు అడ్డుగా నిలబడడడం, బాలయ్య అది ఒంగోలియన్స్ అంటే అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version