NTV Telugu Site icon

Gopichand: శోభన్ బాబు టైటిల్ తో గోపీచంద్

Gopichand

Gopichand

Gopichand: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి శోభన్ బాబు టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా పతాకంపై కూచిబొట్ల వివేక్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ లో రివీల్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రామబాణం’ అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఇదే టైటిల్ తో శోభన్ బాబు హీరోగా ఓ సినిమా వచ్చింది. దానికి ఎం.ఎస్. రెడ్డి నిర్మాత. కృష్ణంరాజు, మోహన్ బాబు, లత ఇతర తారాగణం. ఇక ఇప్పటి సినిమా విషయానికి వస్తే గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది. ఖుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నారు.

గోపీచంద్, శ్రీవాస్ కలయికలో ఇంతకు ముందు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ చక్కటి లాభాలను తెచ్చిపెట్టాయి. ‘రామబాణం’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ధ్యేయంతో ఉన్నారు గోపీచంద్, శ్రీవాస్. నిజానికి ఇప్పటి వరకు ‘అన్ స్టాపబుల్’ షో లో ఇలా టైటిల్ రిలీజ్ చేయడం, సినిమాకి ప్రచారం చేయటం జరగలేదు. ప్రభాస్, గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ కావటంతో ప్రభాష్ షోలో గోపీచంద్ అతిథిగా పాల్గొనటంతో ‘రామబాణం’కి కూడా చోటు దక్కింది. ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ‘రామబాణం’లో సామాజిక సందేశం కూడా ఉందంటున్నారు. భూపతి రాజా కథ అందిస్తున్న ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ మాటలు, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Show comments