Site icon NTV Telugu

Gopichand Malineni: తారక్ చేయాల్సిన ఆ రీమేక్.. చిరంజీవి చేతికి వెళ్లింది

Tarak To Chiranjeevi Kathi

Tarak To Chiranjeevi Kathi

Gopichand Malineni About Missing A Movie Chance With Jr NTR: దానే దానే లిఖా హోతా జిస్కా నామ్ అన్నట్టు.. ఎవరు ఏ సినిమా చేయాలో కూడా ముందే రాసిపెట్టి ఉంటుందని చెప్తుంటారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. చివరికి అది చేరాల్సిన వ్యక్తికే చేరుతుందని అంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ‘ఖైదీ నం. 150’ సినిమా! మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేయడానికి ముందు.. విజయ్ ‘కత్తి’ సినిమాను తారక్‌తో చేయాలని అనుకున్నారు. చర్చలు కూడా జరిగిపోయాయి. కానీ.. ఫైనల్‌గా అది చిరు చేతికి వెళ్లింది. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Varalaxmi Sarathkumar: నన్ను చంపేస్తారనుకున్నా.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘తమిళంలో కత్తి సినిమా చూసిన తర్వాత తెలుగులో ఎన్టీఆర్‌తో రీమేక్ చేయాలని అనుకున్నాం. ఈ విషయాన్ని డైరెక్టర్ మురుగదాస్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా బాగుంటుందని చెప్పారు. ఆయన ఎన్టీఆర్‌తో మాట్లాడటం కూడా జరిగింది. మేమిలా మాట్లాడుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా ఆ ‘కత్తి’ హక్కుల్ని చిరంజీవి కొనేశారని తెలిసింది. నిజానికి.. విజయ్ వల్ల ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేసేందుకు మేము ప్రయత్నిస్తే.. విజయ్ దాన్ని డబ్బింగ్ చేయించి, తెలుగులో రిలీజ్ చేయాలని ఆసక్తి చూపించాడు. అయితే.. ఆ మేటర్‌లో కాస్త సందిగ్ధం ఏర్పడింది. మేము మళ్లీ రీకనెక్ట్ అయ్యేలోపు.. ఆ సినిమా హక్కుల్ని చిరు కొన్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు.

Naga Babu: మంత్రి రోజాకు నాగబాబు కౌంటర్.. ఆమె గురించి మాట్లాడటం అంటే..?

‘కత్తి’ రీమేక్ క్యాన్సిల్ అవ్వడంతో.. తారక్‌తో తాను మరో సినిమా చేయాలని ప్లాన్ చేశానని గోపీచంద్ పేర్కొన్నాడు. దిల్‌రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయాలనుకొని, తారక్‌కి ఒక మాస్ కథని వినిపించాను. అయితే.. నీ నుంచి ఇంత మాస్ కథని ఎక్స్‌పెక్ట్ చేయలేదని, ఇంత భారీ సినిమాను చేయలేనని, కొంత కామెడీ యాంగిల్ ఏమైనా ఉంటే చెప్పమని తారక్ అడిగారని వివరించాడు. అలా తనకు రెండుసార్లు ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్సులు మిస్ అయ్యాయని గోపీచంద్ తెలియజేశాడు.

Ladies Hostel Robbery: లేడీస్ హాస్టల్‌లో చోరీ.. బావిలో బుక్కైన చోర్

Exit mobile version