Site icon NTV Telugu

Pakka Commercial: ప్రభాస్‌తో మల్టీస్టారర్ కు సిద్ధమే: గోపీచంద్

Pakka Commercial

Pakka Commercial

 

విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న ఈ సినిమా జూలై 1న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు చిత్రయూనిట్.

ఇందులో హీరో గోపీచంద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. అలాగే తనకు ప్రభాస్ అంటే చాలా యిష్టమని.. ఎప్పుడైనా తనతో నటించడానికి సిద్ధమే అని తెలిపారు. పైగా ఆయనతో మల్టీస్టారర్ చేయాలని ఉన్నట్లు చెప్పారు గోపీచంద్. అనంతరం చిత్రయూనిట్ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

Exit mobile version