Site icon NTV Telugu

Breaking: సెట్ లో గోపీచంద్ కు ప్రమాదం.. ఆందోళన లో ఫ్యాన్స్

Gopichand

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన సీటిమార్ ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం విదితమే. ఇక దీంతో తన  తదుపరి చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ తనకు రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న విషయం విదితమే. కొన్నిరోజుల క్రితం గోపీచంద్ 30 వ సినిమాగా  పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ స్పాట్ లో కాలు జారీ కింద పడినట్లు మేకర్స్ తెలిపారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవ్వరు ఆందోళన పడవద్దని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపారు. ఇక విషయం తెలియడంతో గోపీచంద్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. గోపీచంద్ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

Exit mobile version