NTV Telugu Site icon

Gopichand: బాలయ్య వదిలిన ‘రామబాణం’ విక్కీగా వస్తుంది…

Ramabaanam

Ramabaanam

నందమూరి నట సింహం బాలయ్య, ఆహాలో చేస్తున్న టాక్ షోకి ప్రభాస్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ సూపర్ సక్సస్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా మార్చింది హీరో గోపీచంద్ ఎంట్రీ. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ఉన్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య, గోపీచంద్ నెక్స్ట్ సినిమాకి స్వయంగా తనే ఒక టైటిల్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ‘రామబాణం’ అనే టైటిల్ ని బాలయ్య అన్-స్టాపబుల్ సీజన్ 2 స్టేజ్ పైనే అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత రీసెంట్ గా మేకర్స్, రామబాణం షూటింగ్ స్టార్ట్ చేస్తూ అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌజ్ నుంచి మరోసారి ప్రకటించారు. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఫ్లాప్ అనే మాట ఇప్పటివరకూ లేదు. మూడు సినిమాలు చేస్తే మూడు మంచి హిట్స్ గా నిలిచాయి.

Read Also: Gopichand 30: భోగి రోజున బాలయ్య వదిలిన ‘రామబాణం’

నిజానికి యాక్షన్ సినిమాలు చేసుకునే గోపీచంద్ లో కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది అని ప్రూవ్ చేసింది శ్రీవాస్ తో చేసిన మూడు సినిమాలే. అలా గోపీచంద్ కెరీర్ లో హిట్ స్ట్రీక్ లోకి తీసుకోని వెళ్లిన శ్రీవాస్, మరోసారి గోపీచంద్ ఫ్లాప్స్ లో ఉన్న సమయంలో ‘రామబాణం’ చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ‘విక్కీ’గా కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు అంటూ ప్రొడ్యూసర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. శివరాత్రి కానుకగా రామబాణం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టైం చెప్పలేదు కానీ ఈరోజే రామబాణం ఫస్ట్ లుక్ బయటకి రానుంది. మరి ఈ సినిమాలో మ్యాచో హీరో ఎలా కనిపిస్తాడో చూడాలి.

Show comments