Gopichand : మాచో స్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న 33వ సినిమాను విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా హీరో గోపిచంద్‌తో పాటు మెయిన్ పాత్రధారులపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సెంథిల్
ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం గోపీచంద్ చాలానే కష్టపడుతున్నారు. ఇప్పటికే గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపీచంద్ పాత్ర ఇందులో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతోంది మూవీ టీమ్. విజువల్ గ్రాండ్యూర్ తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందిస్తామని అంటున్నారు. గోపిచంద్ గతంలో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారంట. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.
Read Also : Napoleon Returns : ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ రిలీజ్..
